Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ ఐటీ శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు

Sridhar babu
, శనివారం, 9 డిశెంబరు 2023 (12:23 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ నేతలు, వేలాది మంది కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కాకపోతే ప్రధాన కార్యాలయం నుంచే మంత్రులకు సంబంధించిన శాఖల కేటాయింపుపై స్పష్టత లేదు. 
 
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో చర్చించి.. ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కేబినెట్‌లో నియమితులైన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాఖలను కేటాయించారు. ఈ విభాగంలో ఐటీ శాఖ ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ శాఖ కేటాయింపుపై ఉత్కంఠ నెలకొంది.
 
వివరాల్లోకి వెళితే..
 
తెలంగాణలో దశాబ్దకాలం పాటు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు ప్రజల్లో నమ్మకం కలిగించాయని సీఎం బాధ్యతలు స్వీకరించిన అనంతరం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని చెప్పారు. 
 
తెలంగాణ అభివృద్ధిలో ఐటీ, పరిశ్రమలు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేటీఆర్ రెండుసార్లు ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. తన సొంత బ్రాండ్‌ను పరిచయం చేసి, ఆ బ్రాంచ్‌కు కొత్త బ్రాండ్‌ను తీసుకొచ్చినట్లు సమాచారం. 
 
యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా స్వయం ఉపాధి, ఇతర పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేశారు. అంతేకాదు టీ-హబ్ ద్వారా ఐటీ రంగం అభివృద్ధికి పాటుపడ్డారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. 
 
ఐటీ శాఖ మంత్రి ఎవరనే దానిపై గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఐటీ శాఖపై కొందరు మంత్రులు ఆసక్తి చూపుతున్నారు. ఉత్కంఠకు తెరపడింది. నేడు కేబినెట్‌ మంత్రులకు శాఖల కేటాయింపు.. ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నియమితులయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ నాయకుల్లో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ నెంబర్ 1