Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

Advertiesment
image

ఐవీఆర్

, మంగళవారం, 25 నవంబరు 2025 (23:54 IST)
ముంబై, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో మూడేసి రోజుల పాటు సాంస్కృతిక ఆవిష్కరణ, ప్రముఖుల చర్చలు, సౌకర్యవంతమైన ప్రయాణ ఆఫర్‌లను అందించిన స్పెక్టాక్యులర్ సౌదీ కార్యక్రమం విజయవంతంగా తన భారతదేశ యాత్ర ముగించుకుంది. దాదాపు 200,000 మంది సందర్శకులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. సౌదీ టూరిజం బ్రాండ్ సౌదీ, వెల్‌కమ్ టు అరేబియా నిర్వహించిన ఈ కార్యక్రమం, ఆర్ట్ షోకేస్‌లు, కాఫీ, డేట్ అనుభవాలు, అర్దా డ్యాన్స్, అరబిక్ కాలిగ్రఫీ, కలినరీ అనుభవాలు సహా పలు కార్యకలాపాల ద్వారా సౌదీ యొక్క ఆత్మ, సంస్కృతి, స్ఫూర్తిని ఒకచోట చేర్చింది, షీరాజ్ టూర్స్, అట్లాస్ ట్రావెల్స్, యాత్ర, ఫ్లిప్‌కార్ట్+ క్లియర్‌ట్రిప్, అక్బర్ హాలిడేస్, మేక్ మై ట్రిప్ వంటి కీలక వాణిజ్య భాగస్వాములు ఈ వేడుకలలో భాగమయ్యారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లో శరత్ సిటీ మాల్లో  జరిగింది. 
 
భారతదేశ వ్యాప్తంగా జరిగిన ఐదు నగరాల ప్రదర్శన గురించి సౌదీ టూరిజం అథారిటీకి చెందిన APAC మార్కెట్స్ అధ్యక్షుడు అల్హాసన్ అల్దబ్బాగ్ వ్యాఖ్యానిస్తూ, భారతదేశానికి సౌదీ తిరిగి రావడం మన దేశాల మధ్య లోతైన సాంస్కృతిక అనుబంధాన్ని బలోపేతం చేసింది. ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు నగరాల్లో, సౌదీ సంస్కృతి, వంటకాలు, కళ , నృత్యం పట్ల  సానుకూల స్పందనను చూశాము. భారతదేశం మా అత్యంత ముఖ్యమైన మార్కెట్లలో ఒకటిగా ఉంది. ఇరు దేశాల నడుమ  ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరుస్తూనే ఉన్నాము. భారతదేశం నుండి మరింత మంది సందర్శకులను స్వాగతించడానికి ఎదురుచూస్తున్నాము అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్