తెలంగాణ మోడల్ స్కూల్స్‌కు చెందిన వందలాది మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు మంగళవారం డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వద్ద తమ జీతాలు చెల్లించకపోవడంతో భారీ నిరసన చేపట్టారు. ఫిజికల్ డైరెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, వాచ్‌మెన్‌లతో కూడిన ఉద్యోగులు తమ పిల్లలను మోసుకుంటూ డైరెక్టరేట్‌ను ముట్టడించారు.
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	దీనిపై నిరసనకారులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఆరు నెలలుగా తమ జీతాలు చెల్లించలేదు. ప్రస్తుతం, 194 మోడల్ స్కూల్స్‌లో 776 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. జీతాలు లేకుండా ఆరు నెలలు గడిచాయి. మా కుటుంబాలకు వారి రోజువారీ అవసరాలను తీర్చడం కష్టతరం అవుతోంది.. అని తెలంగాణ మోడల్ స్కూల్స్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు.
 
									
										
								
																	
	 
	ఈ అంశంపై డైరెక్టరేట్ అధికారులు సెప్టెంబర్ 8 నాటికి వారి జీతాలు విడుదల చేస్తామని నిరసనకారులకు హామీ ఇచ్చారు. సమ్మె నోటీసు అందించిన ఉద్యోగులు, సెప్టెంబర్ 8 నాటికి జీతాలు జమ చేయకపోతే తమ పనిని బహిష్కరించి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతూ, తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యాకమల్లు ప్రభుత్వాన్ని ఉద్యోగుల జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరారు.