లేడీ అఘోరీ కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. లేడీ అఘోరీ ముసుగులో అతడు పచ్చి మోసాలు చేస్తుంటాడనీ, అతడికి రాష్ట్రానికో అమ్మాయి వుంటుందంటూ మీడియాతో మాట్లాడుతూ చెప్పింది అఘోరీకి మొదటి భార్యనని చెప్పుకుంటున్న రాధిక.
ఆమె మాట్లాడుతూ... మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు పెళ్లయి పిల్లలు వున్న స్త్రీలతో అఘోరీ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. అంతేకాదు... వాళ్లిద్దరిలో ఓ మహిళ ఎంతో అందంగా వుంటుందని తనతో చెబుతుండేవాడంటూ వెల్లడించింది.
ఎవరైనా బాధలు, సమస్యలు చెప్పుకునేందుకు వెళితే వారికి మాయ మాటలు చెప్పి లొంగదీసుకుంటాడని ఆరోపించింది రాధిక. అలా లొంగదీసుకుని వారిని వాడుకుని ఆ తర్వాత వదిలేస్తాడనీ, ఇటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదనీ, కఠిన చర్యలు తీసుకోవాలంటూ చెప్పింది. కాగా లేడీ అఘోరీగా చెప్పుకుంటున్న అతడికి కోర్టు బెయిల్ నిరాకరించింది.