Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

Advertiesment
Snake

సెల్వి

, శుక్రవారం, 15 నవంబరు 2024 (20:09 IST)
Snake
రిటైర్డ్ ఎస్సీసీఎల్ ఉద్యోగి పాముకాటుకు గురయ్యాడు. అయితే పాము కరిచిందని భయపడి స్పృహ కోల్పోకుండా.. ఆ పామును చంపి.. ఆస్పత్రికి తన వెంటే తీసుకెళ్లాడు. వివరాల్లోకి వెళితే.. రిటైర్డ్ ఉద్యోగి జంగా ఓదెలు ఉద్యోగ విరమణ తర్వాత పెనుబల్లి సమీపంలోని తన పొలంలో కూరగాయలు పండిస్తున్నాడు. శుక్రవారం పొలంలో పని చేస్తుండగా పాము కాటు వేసింది. సాధారణంగా పాము కాటుకు గురైన వారెవరైనా భయాందోళనకు గురవుతారు. కానీ ఓదెలు పాము వెంట పరుగెత్తి, చంపి, పాలిథిన్ కవర్‌లో ప్యాక్ చేసుకున్నాడు.
 
అనంతరం ద్విచక్రవాహనంపై వ్యవసాయ పొలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని తన ఇంటికి చేరుకుని సింగరేణి ఆస్పత్రి పుస్తకం తీసుకుని ఆస్పత్రిలోని క్యాజువాలిటీ విభాగానికి చికిత్స నిమిత్తం వెళ్లాడు. కవర్‌లో ఉన్న పామును చూసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్యులు, సిబ్బంది, రోగులు భయాందోళనకు గురయ్యారు.
 
 
 
పాము చనిపోయిందని ఓదేలు వారికి చెప్పడంతో సరైన రోగ నిర్ధారణ చేసి చికిత్స అందించాలని దాని గుర్తింపు కోసం తనతో పాటు ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఓదెలు చర్య మొదట క్యాజువాలిటీ ప్రాంతంలోని ప్రజలను భయపెట్టినప్పటికీ, తరువాత అతని సాహసోపేతమైన చర్యకు ప్రశంసలు అందుకుంది. ఓదెలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. 
 
కాగా ఓదెలును కరిచిన పాము రక్త పింజర అని తెలిసింది. దేశంలో అత్యధిక పాముకాటు మరణాలకు కారణమైన నాలుగు విష సర్పాలలో ఇది కూడా ఒకటి. అన్ని పాములు గుడ్ల ద్వారా పిల్లల్ని కంటాయి. కానీ ఇది ఢిఫరెంట్. పిల్లలను కనడం ఈ పాము మరో ప్రత్యేకత. కొన్నిసార్లు వందల సంఖ్యలో పిల్లలను కంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం