Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరగంట పాటు విద్యుత్ సరఫరా నిలిపివేత.. కీసర డివిజినల్ ఇంజనీర్ సస్పెండ్

power cuts

వరుణ్

, సోమవారం, 29 ఏప్రియల్ 2024 (10:55 IST)
హైదరాబాద్ నగరంలోని హబ్సిగూడ కీసర డివిజిన్ ఇంజనీర్ ఎన్.భాస్కర్ రావు సస్పెండ్ అయ్యారు. దీనికి కారణం ఆయన అరగంటపాటు విద్యుత్ సరఫరాను నిలిపివేయడమే. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటిటెడ్ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాలు జారీచేశారు. నాగారం ఆపరేషన్ అడిషనల్ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈఈ) పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
 
అత్యవసర పరిస్థితుల్లో లైన్ క్లియరెన్స్ (ఎల్సీ) తీసుకోవాలన్నా.. సర్కిల్ ఎస్ఈ ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. 33కేవీ అమ్ముగూడ ఫీడర్‌పై డీఈ భాస్కర్ రావు అనుమతి లేకుండానే ఎల్సీ ఇచ్చారు. దీంతో ఆ రోజు ఉదయం 10.05 నుంచి 10.35 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదేసమయంలో నాగారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కరెంట్ కోతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
ఈ విషయం కార్పొరేట్ కార్యాలయం దృష్టికి వెళ్లింది. దాంతో నివేదిక ఇవ్వాలని ఎస్ఈ, సీజీఎంను సీఎండీ కోరడం జరిగింది. ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా అరగంట పాటు విద్యుత్ సరఫరా నిలిపేశారని తేలింది. దీనిని తీవ్రంగా భావించిన యాజమాన్యం డీఈ, నాగారం ఏఈఈపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అలాగే ఈ వేసవిలో వినియోగదారులకు నిరంతర కరెంట్ సరఫరాకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై కార్పొరేట్ కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచలోనే అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణం.. స్పెషాలిటీస్ ఏంటంటే...