Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న సీఎం కేసీఆర్

kcr
, గురువారం, 14 డిశెంబరు 2023 (15:17 IST)
హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ రేపు డిశ్చార్జ్ కానున్నారు. ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఇంటికి వెళ్లేందుకు వైద్యులు అనుమతించారు. ఆస్పత్రి నుంచి నేరుగా నందినగర్‌లోని తన నివాసానికి వెళ్లనున్నారు. మరోవైపు, కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. రేవు డిశ్చార్జ్ చేస్తున్నామని వెల్లడించారు. 
 
తన ఫామ్‌హౌస్‌లోని బాత్రూమ్‌లో ప్రమాదశాత్తు కాలు జారిపడటంతో కేసీఆర్ తుంటి ఎముక విరిగిన విషయం తెల్సిందే. యశోద ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ నిర్వహించి తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్‌ను అమర్చారు. ఆస్పత్రిలో కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి, చంద్రబాబు, చిరంజీవి, చిన్న జీయర్ స్వామి, ప్రకాశ్ రాజ్ తదితర ప్రముఖులు పరామర్శించారు. ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గత 6 రోజులుగా ఆయన యశోద ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. 
 
ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్న మహిళకు మూడోసారి గర్భం.. ఎక్కడ? 
 
పిల్లలు పుట్టకుండా ఉండేందుకు మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తుంటారు. అదే పురుషులకు అయితే, వ్యాసక్టమీ శస్త్రచికిత్స చేస్తారు. అయితే, బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ మూడోసారి కూడా గర్భందాల్చింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ గ్రామంలో వెలుగు చూసింది. 
 
ఈ గ్రామంలోని గైఘాట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాధిత మహిళ గత 2015లో కు.ని. ఆపరేషన్ చేయించుకుంది. ఆమె భర్త హర్యానాలో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ మహిళ ఆర్థిక పరిమితుల కారణంగా ఎక్కువ మంది పిల్ల వద్దనుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు ముందుకు వచ్చింది. 
 
అయితే, తాను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రెండుసార్లు గర్భందాల్చాలని మహిళ వాపోతుంది. ఇపుడు మళ్లీ మూడోసారి తాను గర్భందాల్చానని తెలిపింది. దీంతో వైద్యులు గర్భవతిని పరీక్షించారు. 
 
కాగా, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాక గర్భందాల్చడంతో 2018వ సంవత్సరంలో జిల్లా మేజిస్ట్రేట్ ఆ మహిళకు ఆరు వేల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు కూడా. ఇపుడు మళ్లీ మరోమారు గర్భందాల్చడం కలకలం సృష్టిస్తుంది. కాగా, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఆరోగ్య కేంద్రం ఇన్‌ఛార్జ్ సివిల్ సర్జన్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శంషాబాద్ విమానాశ్రయానికి టీఎస్ ఆర్టీసీ బస్సులు