Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జైలులో ఆర్ఎస్ఎస్ పుస్తకాలు చదువుతున్న కల్వకుంట్ల కవిత, భాజపాలో చేరుతారా?

kavitha

ఐవీఆర్

, గురువారం, 4 ఏప్రియల్ 2024 (15:52 IST)
లిక్కర్ స్కాంలో తీహార్ జైలులో కస్టడీలో వున్న కల్వకుంట్ల కవిత ప్రస్తుతం RSS పుస్తకాలు చదువుతున్నారట. ఈ వార్త తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. భారాస చీఫ్ కేసీఆర్ కి కమలం పార్టీ నాయకులంటే అగ్గిమీద గుగ్గిలం అవుతారు. అలాంటిది ఆయన కుమార్తె జైల్లో కూర్చుని ఆరెస్సెస్స్ పుస్తకాలు చదవడమేమిటా అని చర్చించుకుంటున్నారు.
 
అసలు విషయానికి వస్తే.. కోర్టు ఆదేశాల ప్రకారం జైలు అధికారులు నడుచుకోవడం లేదనీ, తనకు సౌకర్యాల కల్పన చేయడంలో విఫలమవుతున్నారని ఆమె సీబీఐ కోర్టుకి విన్నవించుకున్నారు. విచారించిన కోర్టు... కవితను రాజకీయ నిందితురాలుగా చూడాలని, ఆమె అడిగినవి పరిశీలించి మంజూరు చేయాలన్నారు. ఈ క్రమంలో కవిత కావాలని అడిగిన జాబితా చూసి లాయర్లు, జైలు అధికారులు షాక్ తిన్నారట. సునీల్ అంబేద్కర్ రాసిన ఆర్ఎస్ఎస్ రోడ్ మ్యాప్ 21 శతాబ్దం పుస్తకం కావాలని అడిగారట. ఇంకా గజేంద్ర మోక్షం వగైరా పుస్తకాలు తనకు కావాలని విజ్ఞప్తి చేసారు.
 
ఇంకా తన వంటిపై నగలు అనుమతించాలి, బెడ్ షీట్లు వసతులు కల్పించాలని కోరారు. తనకు జపం చేసుకునేందుకు జపమాల, లేసులు లేని షూస్ కావాలని అడిగిందట. కవితలో వచ్చిన ఈ మార్పును చూసినవారు... త్వరలో కవిత భాజపాలో చేరిపోతారనే ప్రచారం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెవన్యూ సిబ్బందితో టిక్కెట్లు అమ్మించారుగా... ఇపుడు పెన్షన్లు ఇప్పించలేరా? : పవన్ కళ్యాణ్