Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలను పూజిస్తున్న దేశంలో చిరంజీవి అలా ఎలా మాట్లాడుతారు? కేఏ పాల్ కౌంటర్ (Video)

Advertiesment
ka paul

ఠాగూర్

, బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (17:14 IST)
కోట్లాది మంది మహిళలను పూజిస్తున్న భారత్ వంటి పుణ్యభూమిలో మహిళలను కించపరిచేలా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారని, అందువల్ల ఆయన తక్షణం బహిరంగ క్షమాపణలు చెప్పాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. తాజాగా హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న చిరంజీవి.. తన ఇల్లు ఓ లేడీస్ హాస్టల్‌లా ఉందని, ఆ హాస్టల్‌కు తాను వార్డెన్‌లా ఉన్నానని, అందువల్ల మా కుటుంబానికి ఓ మగబిడ్డ కావాలని తనయుడు, హీరో రామ్ చరణ్‌కు చెప్పినట్టు చిరంజీవి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. 
 
వీటిపై కేఏ పాల్ స్పందించారు. మనవరాలు కాకుండా మనవడు పుడితే బాగుండు అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. 75 కోట్ల మహిళలను పూజిస్తున్న భారత దేశంలో మహిళలను కించపరిచేలా చిరంజీవి మాట్లాడారన్నారు. కట్నాలు ఇవ్వలేక, పసిబిడ్డలను చంపుతుంటే ఖండించాల్సిందిపోయి ఆడపిల్ల పుట్టిందని మనవడు పుడితే బాగుండని అంటారా అని ప్రశ్నించారు. అందువల్ల చిరంజీవి తక్షణం క్షమాపణ చెప్పాలని, మహిళా సమాజానికి సారీ చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. 
 
మా ఇల్లు లేడీస్ హాస్టల్‌లా ఉంది.. మళ్లీ అమ్మాయిని కంటాడేమోనని భయం..: చిరంజీవి 
 
మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఇళ్లు ఓ లేడీస్ హాస్టల్‌లా ఉందన్నారు. ఇంటి నిండా అమ్మాయిలేనని చెప్పారు. అందుకే మగ పిల్లాడిని ఇవ్వమని నా బిడ్డ చరణ్‌కు చెప్పాను. కానీ, మళ్లీ అమ్మాయిని కంటాడేమోనని భయంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. 
 
మంగళవారం రాత్రి హైదరాబాద్ నగరంలో "బ్రహ్మ ఆనందం" ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలపై స్పందించారు. ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. సినిమాలకు అతి దగ్గరగా ఉంటూ కళామతల్లి సేవలో మరిన్ని మంచి సినిమాలు చేస్తానని చెప్పారు. చాలా మందికి ఇటీవలి కాలంలో సందేహాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద నాయకులను కలుస్తున్నాడు.. అటు వైపు వెళ్తాడా అని కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు... ఈ జన్మకు రాజీకీయాల్లోకి వెళ్లను. పైగా, తన ఆశయాలను, లక్ష్యాలను తమ్ముడు పవన్ కళ్యాణ్ ముందుకు తీసకెళ్లి నేరవేరుస్తాడు అన్నారు.
 
నా ఇల్లు లేడీస్ హాస్టల్‌లా ఉంటుంది. చుట్టూ ఆడపిల్లలతో. మగ పిల్లాడిని ఇవ్వమని చరణ్‌కు చెప్పాను. మళ్లీ అమ్మాయిని కంటాడేమోనని భయంగా ఉంది అని చిరంజీవి అన్నారు. పైగా, మా తాత మంచి రసికుడు. నాకు ఇంట్లోనే ఇద్దరు అమ్మమ్మలు ఉండేవారు. వాళ్లమీద కోపం వస్తే మూడో ఆవిడ వద్దకు వెళ్లేవారు. ఆ సమయంలో నేను సినిమాల్లోకి వెళతానంటే ఆయనను మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దని మా పెద్దలు చెప్పారు. ఎందుకంటే సినిమాల్లో ఎక్కువగా అలాంటి అవకాశాలు ఉంటాయి, కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పేవారు. అదృష్టవశాత్తు నాకు అలాంటి అలవాట్లు లేవు అని చిరంజీవి అన్నారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Pawan Kalyan: కేరళ, తమిళనాడు ఆలయాల సందర్శన వ్యక్తిగతం.. పవన్ కల్యాణ్