Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిమ్మకాయను గాలి లోకి లేపుతూ మాజీ సర్పంచ్ క్షుద్రపూజ, వీడియో వైరల్

Advertiesment
Lemon goes into air

ఐవీఆర్

, సోమవారం, 8 డిశెంబరు 2025 (13:49 IST)
క్షుద్రపూజల సంఘటన ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట, కొమ్ముగూడెంలో కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్షుద్రపూజల్లో మాజీ సర్పంచ్ ఒకరు నిమ్మకాయను గాల్లోకి లేపుతూ కన్పించారు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కొమ్ముగూడెం గ్రామంలో నారపోగు నాగరాజు క్షుద్రపూజలు చేస్తూ ఆ ప్రాంతంలోని గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. నాగరాజు... ఏవో మంత్రాలు చదువుతూ చేతులు అటూఇటూ తిప్పుతూ నిమ్మకాయను గాల్లోకి లేపుతూ ఆ తర్వాత దాన్ని కిందక దింపుతూ చేసిన విన్యాసాలను చూసిన స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నాగరాజు ప్రజల్లో మూఢ నమ్మకాలను వ్యాపింపజేస్తున్నారనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృత్యువాత