Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

Advertiesment
hyd metro timings

ఠాగూర్

, బుధవారం, 2 ఏప్రియల్ 2025 (08:59 IST)
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే. ప్రయాణికుల సౌకర్యార్థం అర్థరాత్రి 12 గంటల వరకు సేవలు అందించాలని మెట్రో నిర్ణయించింది. సోమవారం నుంచి కొత్త వేళలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుత నష్టాల్లో నడుస్తున్న మెట్రో దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం ప్రతి రోజూ సగటున 5 లక్షలు మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్యను 7 లక్షలకు చేర్చాలనేది మెట్రో లక్ష్యం. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, ప్రయాణికులు కూడా మెట్రో సేవలను పొడగించాలని ఎప్పటి నుంచే కోరుతున్నారు. వారి డిమాండ్ ఇన్నాళ్ళకు నెరవేరింది. రైళ్ల రాకపోకలకు, ట్రాక్ నిర్వహణకు సమయం చాలాదన్న ఉద్దేశంతో ఇన్నాళ్లు రైళ్ల వేళల పెంపు విషయంలో మెట్రో తాత్సారం చేసింది. 
 
తాజాగా నిన్నటి నుంచి వేళలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అర్థరాత్రి విధులు ముగించుకునే ఉద్యోగులకు, దూర ప్రయాణాలు చేసి రాత్రివేళ నగరానికి చేరుకునే వారికి మెట్రో నిర్ణయం ఉపయోగకరంగా మారనుంది. మరోవైపు, నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు చార్జీలను పెంచాలని మెట్రో ప్రతిపాదించింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!