Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన మాజీ గవర్నర్ దంపతులు..

eslnarasimhan couple

ఠాగూర్

, ఆదివారం, 7 జనవరి 2024 (16:30 IST)
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆ రాష్ట్ర మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు ఆదివారం కలుసుకున్నారు. తుంటి ఎముక ఆపరేషన్ తర్వాత హైదరాబాద్ జూబ్లీహిల్స్ నంది నగర్‌లో ఉన్న తని నివాసంలో కేసీఆర్ విశ్రాంతి తీసుకున్న విషయం తెల్సిందే. ఆయనను పరామర్శించేందుకు నరసింహన్ దంపతులు స్వయంగా కేసీఆర్ నివాసానికి వచ్చారు.
 
ఈ క్రమంలో కోలుకుంటున్న కేసీఆర్‌ను నరసింహన్ దపంతులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా ఆరోగ్య వంతులు కావాలంటూ ఆకాంక్షించారు. కాగా, కేసీఆర్ నివాసానికి వచ్చిన నరసింహన్ దంపతులకు మాజీ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ స్వాగతం పలికారు. 

తొమ్మిదో తరగతి చదివే కుమార్తెపై కన్నతండ్రి అత్యాచారం.. 
 
హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి చదవుతున్న కన్నబిడ్డపై కామంతో కళ్లు మూసుకునిపోయిన కన్నతండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘాతుకానికి పాల్పడింది బీహార్ నుంచి నగరానికి పొట్టకూటి కోసం వలస వచ్చిన కసాయి వ్యక్తి కావడం గమనార్హం. 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక ఫ్యామిలీ కుత్బుల్లాపూర్‌కు కొన్నేళ్ళ క్రితం వలస వచ్చింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతుంది. వయసు 14 యేళ్ళు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఆ బాలిక పాఠశాలకు వెళ్ళకుండా ఇంటిపట్టునే ఉంటుంది. ఈ క్రమంలో ఇంట్లోనే ఉంటున్న వయసుకొచ్చిన కుమార్తెపై కన్నేసిన కసాయి తండ్రి.. నయానా భయానో లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడసాగాడు. 
 
పైగా, ఈ విషయం తల్లితో సహా ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించాడు. అయితే రోజు రోజుకూ తండ్రి ఆగడాలు హెచ్చుమీరిపోవడంతో కన్నతల్లి దృష్టికి తీసుకెళ్లింది. అయితే కన్నబిడ్డ మాటలు ఆ తల్లి నమ్మలేదు. పైగా తండ్రిపై లేనిపోనివి చెప్పొద్దంటూ కోపగించుకుంది.  ఆ తర్వాత తన స్నేహితుడి ద్వారా పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికల హాస్టల్ నుంచి అదృశ్యమైన 22 మంది అమ్మాయిలు...