Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనను తిరస్కరించిన మాజీ డీఎస్పీ నళిని

ex dsp nalini
, ఆదివారం, 17 డిశెంబరు 2023 (21:44 IST)
తెలంగాణ ఉద్యమం కోసం తన పదవికి రాజీనామా చేసిన మాడీ డీఎస్పీ నళిని మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేశారు. కానీ, నళిని మాత్రం సున్నితంగా తిరస్కరించారు. తాను ప్రశాతంగా ఉన్నానని, తన ప్రశాంతతకు భంగం కలిగించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. 
 
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి మళ్లీ ఉద్యోగం చేయాలన్న ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాను ఆదేశించారు. రాజీనామా చేసిన అధికారిని తిరిగి పోలీస్ శాఖలోనే ఉద్యోగం ఇచ్చేందుకు ఏవేని అడ్డంకులు ఉంటే మరో శాఖలో అదో హోదా కలిగిన ఉద్యోగాన్ని ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కోరారు. 
 
నళినికి న్యాయం జరగలేదని, ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు చాలామంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రం కోసం రాజీనామా చేసిన నాయకులకు పదవులు ఇచ్చినప్పుడు.. నళినికి ఎందుకు అన్యాయం జరగాలని రేవంత్ ప్రశ్నించారు.
 
ఈ నేపథ్యంలో నళినిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలన్న ప్రభుత్వం ఆలోచనను ఆమె వద్ద ఓ విలేకరి ప్రస్తావించారు. దీనిపై ఆమె స్పందిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. తానిప్పుడు సంతోషంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. తాను రాజీనామా చేసి రాజకీయ నాయకుల నుంచి తప్పించుకున్నానని తెలిపారు. దయచేసి తన ప్రశాంతతకు భంగం కలిగించవద్దని కోరుతున్నట్టు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం రేవంత్‌ రెడ్డితో సమావేశమైన ఆర్బీఐ మాజీ గవర్నర్