Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీ సీఎం కేసీఆర్‌కు షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం- 48 గంటల పాటు నిషేధం

kcrao

ఠాగూర్

, బుధవారం, 1 మే 2024 (19:52 IST)
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. ఆయన ఎన్నికల ప్రచారంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు అంటే రెండు రోజుల పాటు నిషేధం విధించింది. కొన్ని రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో ఆయన విపక్ష నేతలతో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలపై చేశారంటూ ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం స్పందించింది. ఈ నిర్ణయంతో బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు అంటే ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు ఆయన ప్రచారంపై నిషేధం వర్తిస్తుంది. 
 
రిజర్వేషన్లు రద్దు చేయం... : హోం మంత్రి అమిత్ షా స్పష్టీకరణ 
 
దేశంలో ఎన్నో దశాబ్దాలుగా అమలవుతున్న రిజర్వేషన్లను రద్దు చేయనివ్వమని, రద్దు కానివ్వబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆయన ఆరోపించారు. తమ పార్టీకి రిజర్వేషన్లను రద్దు చేసే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు. హస్తం పార్టీ పన్నుతున్న కుట్రలను ముందుకుసాగనివ్వమని దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఛండీగఢ్‌లో బుధవారం ఏర్పాటుచేసిన ప్రచారంలో పాల్గొన్న అమిత్‌ షా కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. 
 
'అసత్యాన్ని బిగ్గరగా పునరావృతం చేస్తూ ప్రజలను నమ్మించడమే కాంగ్రెస్‌ ఫార్ములా. మరోసారి మోడీ గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని అబద్ధాలు చెబుతున్నారు. నా ఫేక్‌ వీడియోను సర్క్‌లేట్‌ చేశారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ సర్కార్‌ ఏనాడు రిజర్వేషన్ల తొలగింపు గురించి ప్రస్తావించలేదు. రిజర్వేషన్లను రద్దు చేయం.. చేయనివ్వం' అని అమిత్‌ షా పేర్కొన్నారు. 
 
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి చవిచూస్తుందని.. ఆ తర్వాత ఆ నిందను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై వేస్తుందని షా ఆరోపించారు. ఓడిపోయే కుటుంబం కోసం అసత్యాలను ప్రచారం చేయొద్దంటూ ఆయనకు సూచించారు. 'ప్రధాని మోడీ మెజారిటీని ఉపయోగించి ఆర్టికల్‌ 370, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, బాల రాముడి మందిరం, సీఏఏ అమలుచేశారు. ఐదేళ్లలో జార్ఖండ్‌, బీహార్‌, తెలంగాణ, ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలో నక్సలిజాన్ని నిర్మూలించారు. మరోసారి మోడీ ప్రధాని అయితే.. రెండేళ్లలోనే చత్తీస్‌గఢ్‌లో నక్సలిజం నామరూపాలు లేకుండాపోతుంది. ఇది మోడీ గ్యారంటీ' అని వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు తేజం చిన్నారి కలశకు గౌరవ డాక్టరేట్ ప్రధానం