Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విమానంలో విషపూరిత పాములు... వణికిపోయిన ప్రయాణికులు

Advertiesment
snakes

ఠాగూర్

, సోమవారం, 25 నవంబరు 2024 (15:18 IST)
బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ఓ విమానంలో విషపూరిత పాములను విమానాశ్రయ అధికారులు గుర్తించారు. ఈ విషపూరిత పాములను ఇద్దరు మహిళా ప్రయాణికులు తమ వెంట తీసుకొచ్చినట్టు గుర్తించారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఇలా పాములు కనిపించడం ఎయిర్‌పోర్టులో కలకలం రేపింది. 
 
అధికారులు జరిపిన తనిఖీల్లో పాములు ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ప్రయాణ సమయంలో బ్యాగుల్లోని పాములు బయటికొస్తే తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ విషపూరితమైన పాములను బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ నగరానికి ఎందుకు తీసుకొచ్చారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. పాముల సరఫరా వెనుక ఏదైనా కుట్ర దాగుందా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇక ప్రయాణికుల వద్ద దొరికిన ఆ పాములను అధికారులు అనకొండ పిల్లలుగా గుర్తించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్‌ వెబ్ వెర్షన్‌కు ఇబ్బందులు.. ఏమైంది?