Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

Advertiesment
kova lakshmi

ఠాగూర్

, గురువారం, 7 ఆగస్టు 2025 (17:20 IST)
తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతపై విపక్ష పార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే దాడికి పాల్పడ్డారు. రేషన్ కార్డుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన సభలో అధికార, విపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. దీంతో పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ చూస్తుండగానే అసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాంగ్రెస్ నియోజకవర్జ్ శ్యామ్ నాయక్‌పై వాటర్ బాటిల్‌తో దాడి చేశారు. ఈ ఘటనతో సభా ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
 
జిల్లాలోని జంకాపూర్‌లో గురువారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాంగ్రెస్ నేత శ్యామ్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరు నేతల మధ్య ఎన్నికల హామీల అమలుపై చర్చ మొదలైంది.
 
ఈ క్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారకు తులం బంగారం వంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. దీనిపై శ్యామ్ నాయక్ వెంటనే స్పందిస్తూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని, నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఎదురుదాడికి దిగారు.
 
ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదిరింది. శ్యామ్ నాయక్‌ వ్యాఖ్యలతో తనను అవమానించారని భావించిన కోవ లక్ష్మి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆవేశంతో తన ముందున్న వాటర్ బాటిళ్లను తీసి ఆయనపైకి విసిరారు. ఊహించని ఈ పరిణామంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. వెంటనే అధికారులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)