Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

Advertiesment
Ambulance

ఐవీఆర్

, బుధవారం, 19 నవంబరు 2025 (21:04 IST)
సికింద్రాబాద్: వివిధ వర్గాలకు ఆరోగ్య సంరక్షణ సేవలు, అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చే దిశగా, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద తెలంగాణలో ఒకటి సహా భారతదేశవ్యాప్తంగా పూర్తి స్థాయి పరికరాలున్న 10 అంబులెన్స్‌లను బంధన్ బ్యాంక్ విరాళంగా అందించింది. బ్యాంకు యొక్క 10వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాల సందర్భంగా దీన్ని ప్రకటించింది.

అత్యవసర పరిస్థితుల్లో పేషంట్లకు సకాలంలో వైద్య సేవలు అందేలా చూసే క్రమంలో ఆరోగ్య సంరక్షణ సర్వీసుల లభ్యతను మెరుగుపర్చడంపై బ్యాంకునకు గల నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. బంధన్ బ్యాంక్ స్వతంత్ర డైరెక్టర్ శంతను ముఖర్జీ సమక్షంలో సికింద్రాబాద్‌లోని భారత్ సేవాశ్రమ్ సంఘ్‌కి అంబులెన్స్ లాంఛనంగా అందజేయబడింది. భారత్ సేవాశ్రమ్ సంఘ్ కార్యదర్శి స్వామి మునీశ్వరానందాజీ, అసిస్టెంట్ సెక్రటరీ స్వామి వెంకటేశ్వరానందాజీ ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
బెంగళూరు, అహ్మద్‌నగర్, అహ్మదాబాద్, వదోదర, ఢిల్లీ, జైపూర్, అక్బర్‌పూర్, జలంధర్, కోల్‌కతా, సికింద్రాబాద్‌ సహా దేశవ్యాప్తంగా ప్రముఖ వైద్య సంస్థలు, ఆరోగ్య సంరక్షణ సంస్థలకు అంబులెన్స్‌లు విరాళంగా అందించబడ్డాయి. వివిధ రాష్ట్రాలవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, ఆస్పత్రులకు మద్దతు కల్పించడం ద్వారా పటిష్టమైన, ఆరోగ్యకరమైన, ఎలాంటి సవాళ్లనైనా తట్టుకుని నిలబడగలిగేలా కమ్యూనిటీలను బలోపేతం చేసేందుకు బ్యాంకు తోడ్పడుతోంది.
 
నాణ్యమైన ఆరోగ్యసంరక్షణ సేవలనేవి అందరికీ లభించని విశేషాధికారం కాదు, ప్రాథమిక హక్కు అని బంధన్ బ్యాంక్ గట్టిగా విశ్వసిస్తుంది. వివిధ వర్గాలకు సేవలందిస్తున్న ఆస్పత్రులకు మద్దతుగా నిలుస్తూ, ఎమర్జెన్సీ వైద్య సేవలను పటిష్టం చేయాలన్న మా లక్ష్యానికి ఈ ప్రయత్నం తోడ్పడుతుందని విశ్వసిస్తున్నాం. సమ్మిళిత అభివృద్ధి పట్ల మాకున్న నిబద్ధతనేది బ్యాంకింగ్ పరిధికి మించినది. భారతదేశవ్యాప్తంగా మరింత ఆరోగ్యవంతమైన, ఎలాంటి సవాళ్లనైనా తట్టుకుని నిలబడగలిగేలా కమ్యూనిటీలను పటిష్టం చేయడం మా లక్ష్యం. అత్యావశ్యకమైన సమయంలో వైద్య సేవలు సకాలంలో అందేలా చూడటం ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనేది మా లక్ష్యం” అని బంధన్ బ్యాంక్ ఎండీ & సీఈవో పార్థ ప్రతిమ్ సేన్‌గుప్తా తెలిపారు.
 
మహిళలు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యసంరక్షణ, విద్య, జీవనోపాధి, వాతావరణ స్థితిస్థాపకతపై ప్రధానంగా దృష్టి పెడుతూ 14 రాష్ట్రాలవ్యాప్తంగా 82 జిల్లాల్లోని 25 లక్షలకు పైగా కుటుంబాలకు బంధన్ బ్యాంక్ యొక్క సీఎస్ఆర్ కార్యక్రమాలు చేరాయి. సామాజిక బాధ్యత, కమ్యూనిటీ అభివృద్ధి పట్ల బంధన్ బ్యాంక్‌కి గల నిబద్ధతకు ఇవి నిదర్శనంగా నిలుస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ