Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీలో భారాస విలీనం వార్తలపై కేసీఆర్ స్పష్టతనివ్వాలి : అసదుద్దీన్ ఓవైసీ

Advertiesment
Asaduddin Owaisi

వరుణ్

, బుధవారం, 17 జులై 2024 (15:30 IST)
భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితి పార్టీని విలీనం చేయబోతున్నట్టు సాగుతున్న ప్రచారంపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోందని, ఇందుకోసం ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఈ వార్తలపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ విషయం గురించి తనకు కూడా పూర్తిగా తెలియదని, పత్రికల్లో వార్తలు మాత్రమే చదివానని చెప్పారు. విలీనం వార్తలపై కేసీఆర్ స్పష్టత నివ్వాలని కోరారు.
 
పార్టీ కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందని, అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు తనకు తెలియవన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతిచెందడం బాధాకరమన్న ఆయన.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
 
ఆర్టికల్ 370 ఎత్తివేశాక కాశ్మీరులో పరిస్థితులు చక్కబడ్డాయని కేంద్రం చెబుతున్నది ఒట్టిదేనని విమర్శించారు. ట్రిపుల్ తలాక్, యూసీసీకి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయించినట్టు చెప్పారు. మహారాష్ట్రలో ముస్లిం ప్రార్థనా స్థలాలు, మసీదులపై దాడులు జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం కానీ, కేంద్రం కానీ పట్టించుకోవడం లేదని ఒవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసు : మైనర్లు అత్యాచారం చేసి చంపేశారు.. శవాన్ని తండ్రి మాయం చేశాడు..