Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీ సీఎం కేసీఆర్‌కు మరో షాక్.. కాంగ్రెస్ గూటికి చేవెళ్ల ఎమ్మెల్యే (Video)

Advertiesment
kale yadaiah

వరుణ్

, శుక్రవారం, 28 జూన్ 2024 (16:04 IST)
మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావుకు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్, ఇతర కాంగ్రెస్ నేతల సమక్షంలో కాలె యాదయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీప్‌ దాస్ మున్షీ కూడా ఉన్నారు. 
 
కాగా, ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, తెలంగాణ మాజీ స్పీకర్‌, భారాస బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. దీంతో యాదయ్యతో కలిపి ఇప్పటివరకు ఆరుగురు భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు, తమ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ ప్రస్తుతం విచారణలో ఉంది. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం