మిగ్‌జాం తుఫాను ఓ గర్భిణీతో పాటు గర్భస్థ శిశువును పొట్టనబెట్టుకుంది. గర్భిణిని తరలిస్తున్న అంబులెన్స్..వానకు చిత్తడిగా మారిన రోడ్డులో కూరుకుపోవడంతో మహిళతో పాటు గర్భస్థ శిశువు కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	వివరాల్లోకి వెళితే.. కోయగూడ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఎనిగంటి రమ్యకు పురిటి నొప్పులు రావడంతో ఆమెను ఆంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. అయితే, రాంనగర్ నుండి కమలాపురం వెళ్లేదారిలో వాహనం బురదలో కూరుకుపోయింది. దీంతో, స్థానికులు వాహనాన్ని ట్రాక్టర్ సాయంతో బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. 
 
									
										
								
																	
	 
	అయినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రికి తరలింపులో చాలా ఆలస్యం జరగడంతో ఆమె కడుపులోని శిశువుతో పాటు గర్భిణీ మహిళ ప్రాణాలు కోల్పోయింది.