Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొండాసురేఖపై మండిపడిన అఖిల్.. క్షమించేది లేదు..

Advertiesment
Akhil Akkineni

సెల్వి

, శుక్రవారం, 4 అక్టోబరు 2024 (11:40 IST)
తెలంగాణ కేబినెట్ మంత్రి కొండా సురేఖ సమంత, నాగార్జున కుటుంబానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై కొండా సురేఖ సమంత నాగార్జున కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు. అయితే తనకు ఇంటర్నెల్ గా అందిన సమాచారం మేరకు ఈ వ్యాఖ్యలు చేశానని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా అలాంటి విషయాల గురించి మాట్లాడటానికి తాను ఎప్పుడూ సిగ్గుపడనని చెప్పారు. 
 
ఈ వ్యాఖ్యలపై అక్కినేని అఖిల్ మాట్లాడుతూ.. కొండాసురేఖపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. కొండా సురేఖ చేసిన నిరాధారమైన, హాస్యాస్పదమైన ప్రకటనలు అసభ్యకరమైనవని ఆయన ట్వీట్ చేశారు. ప్రజలను రక్షించాలని ఆశించే ప్రజా సేవకురాలిగా ఆమె తన నైతికత, సామాజిక సంక్షేమాన్ని మరచిపోవాలని నిర్ణయించుకున్నట్లున్నారని సెటైర్లు వేశారు. 
 
కొండా సురేఖ ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిదని మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలు మా కుటుంబ సభ్యుల గౌరవాన్ని కించపరిచాయి. అగౌరవ పరిచాయి. ఆమె స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం ఎలాంటి సంబంధం లేని తమ కుటుంబాన్ని లాగడం అభ్యతరకరం. 
 
ఆమె ఆడిన రాజకీయ క్రీడలో మాలాంటి అమాయకులను బలిపశువులుగా నిలబెట్టారు. బాధిత కుటుంబ సభ్యుడిగా, సినీ నటుడిగా ఈ విషయంపై నేను మౌనంగా ఉండను. ఈ సిగ్గుమాలిన వ్యక్తికి న్యాయపరంగా తగిన బుద్ది చెప్పే ప్రయత్నం చేస్తామని అఖిల్ మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దాడికి దిగితే అణు యుద్ధమే : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్