Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

Advertiesment
A man married two women

ఐవీఆర్

, శుక్రవారం, 28 మార్చి 2025 (21:13 IST)
ఇద్దరమ్మాయిలనూ ప్రేమించా... ఇద్దర్నీ పెళ్లాడుతానంటూ మొండికేసిన యువకుడు చివరికి అనుకున్నది సాధించాడు. ఇద్దరి మెడల్లో చెరో మూడుముళ్లు మొత్తం ఆరు ముడులు వేసి ట్రిపుల్ అయ్యారు.
 
అసలు విషయానికి వస్తే... కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో సూర్యదేవ్ అనే యువకుడు తను ఇద్దరమ్మాయిలను ప్రేమించినట్లు పెద్దలకు చెప్పాడు. ఐతే ఇద్దరినిచ్చి చేయడం సాధ్యం కాదని తొలుత కాదన్నప్పటికీ పట్టుబట్టి ఇద్దరినీ పెళ్లాడుతానన్నాడు. ఇంకోవైపు ఆ ఇద్దరు యువతులు కూడా సూర్యదేవ్ ను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు. దీనితో చేసేదేమీ లేక పెద్దలు ఇద్దరమ్మాయిలతో అతడి వివాహం జరిపించారు.
 
సూర్యదేవ్ తన వివాహ ఆహ్వాన పత్రిక సైతం పంచాడు. అందులో వారి పేర్లను ముద్రించాడు. సిడాం వారి పెళ్లిసందడి.. చిరంజీవి సుర్యదేవ్ వివాహము, చిలసౌ లాల్ దేవి, జలకర్ దేవిలతో మార్చి 27, 2025 అంటూ పేర్లను ముద్రించి పంపాడు. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూసి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వాటిలో కొన్ని....
 
ఒక్కరితోనే వేగలేకపోతుంటే ఇద్దరితో ఎలా నెట్టుకొస్తాడో ఏమో
వీడు మగాడ్రా బుజ్జీ, కానీ జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ
సచ్ ఎ క్యూట్ ట్రిపుల్
ఏం గుండెరా వాడిది
ఇది ఇల్లీగల్ బ్రో... పోలీసులు దృష్టికి వస్తే కేసు పడతది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు