Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరంగల్‌లో దారుణం- 12ఏళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం.. గర్భవతి కావడంతో?

Advertiesment
rape

సెల్వి

, శనివారం, 5 అక్టోబరు 2024 (14:15 IST)
వరంగల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి చివరకు ఆమెను గర్భవతిని చేశాడు. వివరాల్లోకి వెళితే.. గీసుగొండ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలికపై పక్కింటి వృద్ధుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఇటీవల బాలిక ఆరోగ్యం దెబ్బతినటంతో పాటు కడుపు నొప్పిగా ఉందని చెప్పటంతో తల్లిదండ్రులు సమీపంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లాక అసలు విషయం బయటపడింది. బాలికను పరీక్షించిన డాక్టర్లు గర్భంతో ఉన్నట్లు నిర్ధారించారు. 
 
ఈ ఘటనపై ఆరా తీయగా.. పక్కింట్లో ఉండే వృద్ధుడే తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు చెప్పింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 12 ఏళ్ల బాలిక గర్భం దాల్చటం స్థానికంగా కలకలం రేపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ గాంధీకి పూణే కోర్టు సమన్లు.. ఎందుకో తెలుసా?