తెలంగాణలో కేసీఆర్ ఓ డెడ్‌లైన్‌ల జోకర్... వెక్కిరిస్తున్న పార్టీలు
, సోమవారం, 20 ఆగస్టు 2012 (18:11 IST)
తెలంగాణపై కేంద్రం ఆగస్టు 20 లోపు ఒక ప్రకటన చేస్తుందన్న సమాచారం తన వద్ద ఉందని బల్లగుద్ది చెప్పి, ఆ తేదీ లోపు ప్రకటన చేయకపోతే ఉగ్రరూపం చూడాల్సి వస్తుందని చెప్పిన కేసీఆర్ మాటలకు నేటితో గడువు ముగిసింది. ఆయన విధించిన డెడ్‌లైన్ కాస్తా ముగిసింది. ఇక ఇప్పుడు తెరాస సార్ కేసీఆర్ ఏం చేస్తారూ... అంటూ చర్చలు మొదలయ్యాయి.దీనిపై పార్టీలు జోకులు వేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులయితే... కేసీఆర్ పార్టీ పెట్టిన దగ్గర్నుంచే అలా చెప్పడం అలవాటయిపోయిందని ఎద్దేవా చేస్తున్నారు. ఇక తెదేపాకు చెందిన ముఖ్యనేతలు... కేసీఆర్ ఎప్పటికప్పుడు ఇలా డెడ్‌లైన్లు విధించడం మామూలే. ఆ డెడ్‌లైన్ ముగిశాక మళ్లీ ఉద్యమం అంటూ జనంపై పడటం మామూలే అని అంటున్నారు. ఇక భాజపా నాయకులయితే... 2004 నుంచి మనం చూస్తుండ్లా. ఇప్పుడూ అంతే అని వెక్కిరిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో కేసీఆర్ విధించే డెడ్‌లైన్లపై జోకులేసుకుంటూనే ఆయన ఓ జోకర్ అని చెప్పి నవ్వుకుంటున్నారు. మరి కేసీఆర్ సార్ వారు ఆగస్టు 20 డెడ్‌లైన్ ముగిసిన దరిమిలా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. తెలంగాణ ఎలా తెస్తారో చూడాల్సిందే.