Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేసీఆర్ హెచ్చరిక: అరెస్టులు చేస్తే తెలంగాణాలో ఉండలేరు బిడ్డా

Advertiesment
కేసీఆర్
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2011 (18:24 IST)
FILE
కేసీఆర్ తెలంగాణా పోలీసులకు హెచ్చరిక చేశారు. తాను పోలీసుల కోసం 14 ఎఫ్ రద్దుకోసం దీక్ష చేసి దానిని సాధిస్తే ఇపుడు వారే తెలంగాణా సాధనకు అడ్డంకిగా మారుతున్నారనీ, తెలంగాణా ఉద్యోగ సంఘాల ఐకాస ఛైర్మన్ స్వామి గౌడ్‌ను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని నిలదీశారు.

రేపు తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణాలోనే ఉండాల్సిన మీరు ఇలా ప్రవర్తిస్తే తెలంగాణాలో ఉండలేరు బిడ్డా... మీ పని పడతాం అంటూ హెచ్చరించారు. తెలంగాణా సాధనకు పోలీసులు కూడా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణాలోని నాలుగున్నర కోట్ల మంది ప్రజలు ధర్మబద్ధం కానిది ఏమీ అడగటం లేదనీ, డిసెంబరు 9 నాడు భారత ప్రభుత్వం తెలంగాణా ఇస్తామంటూ చేసిన ప్రకటనకు కట్టుబడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని అడుగుతున్నారన్నారు. ఈ ధర్మబద్ధమైన కోరికను నెరవేర్చేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు.

ఇకనైనా రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి పార్లమెంటులో తెలంగాణా బిల్లును పెట్టేట్లు ఒత్తిడి తేవాలని సూచించారు. రాష్ట్రంలో ఒక ప్రాంతం పూర్తిగా స్తంభించిపోతే అంతా బాగానే ఉందని నివేదికలు ఎలా ఇస్తారంటూ మండిపడ్డారు.

ఇకనైనా స్పందించకుంటే ఢిల్లీకి సెగ పెడతామనీ, దాంతో ఖచ్చితంగా తెలంగాణా వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu