ఆ వాదన సరైంది కాదు: రామానాయుడు
కళాకారుడికి ఎల్లలు లేవనీ, ఈ రంగంలోకి వచ్చినవారు ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అనేదానకి తావులేదనీ, టాలెంట్‌తో ముందుకు సాగే ఈ రంగంలో తెలంగాణాను చొప్పించడం సరైంది కాదనీ రామానాయుడు అన్నారు. గతంలో జై ఆంధ్రా మూవ్మెంట్లో కూడా ఇటువంటి ఒత్తిడి లేదనీ, మరోవైపు కోస్తా, రాయలసీమ అంటూ పలువురు ముందుకు రావడం కూడా సరైంది కాదని అన్నారు. ఏదైనా ఇండస్ట్రీని నమ్ముకునేవారంతా సంయమనంతో వ్యవహరించాల్సిందిగా సూచించారు.బతుకుతెరువుకోసం ఉన్నాం: కార్మికులు ఇండస్ట్రీలో పలు రంగాలకు చెందినవారు ఎక్కువమంది తెలంగాణా ప్రాంతీయులే. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నటీనటులు, టెక్నికల్ విభాగానికి చెందినవారు ఎందరో ఉన్నారు. వారంతా బతుకుదెరువుకోసం వచ్చి ఈ రంగంలో స్థిరపడ్డారు. ఇప్పుడు వీరంతా... "ఏదో బతకుదెరువుకోసం ఇక్కడకు వచ్చాం. మాకెందుకీ గొడవలు" అని అంటున్నారు.తెలంగాణా కావాలి: ఎన్. శంకర్ బుధవారంనాడు హైదరాబాదులోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన తెలంగాణా ఫోరం సమావేశంలో డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. శంకర్ పాల్గొన్నారు. వ్యక్తిగతంగా తను తెలంగాణా కావాలని కోరుకునేవాడిననీ తెలుపుతూ... యూనివర్శిటిలో విద్యార్థులు తెలంగాణా సాధనకు పోరాడుతున్న సందర్భంగా వారికి మద్దతు ప్రకటించారు. గురువారం జరిగే ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో తను పాల్గొంటున్నాననీ, ఇండస్ట్రీలోని తెలంగాణావారు కూడా తనకు మద్దతు పలికారనీ, ఇంకా కొంతమంది రేపు ముందుకు వస్తారని అన్నారు. తనకు మద్దతు తెలిపినవారిలో పోసాని కృష్ణమురళి, కుబుసం దర్శకుడు శ్రీకాంత్‌లు ఉన్నట్లు తెలిపారు.తెలంగాణా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తాం: శ్రీకాంత్ ఇదిలావుండగా... శ్రీహరితో కుబుసం చిత్రాన్ని తీసిన దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ, ఇప్పటికైనా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తమకు మద్దతు తెలపాలనీ, లేదంటే... త్వరలో తెలంగాణా ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలంగాణా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేస్తామని బుధవారంనాడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సంఘీభావ సదస్సులో ప్రకటించారు. ఈ సభలో ఉన్న గద్దర్ స్పందిస్తూ... ఇండస్ట్రీలోని తెలంగాణావారికి పూర్తి సహకారాన్ని అందిస్తాననీ, వారంతా ముందుకు వచ్చి సంఘీభావం తెలియజేయాలని కోరారు.అర్థం లేనిది: ఛాంబర్ ఉద్యమం, అభిమానం అనేది శృతిమించకుండా ఉండాలని తెలుగు చలనచిత్ర వాణిజ్య సంఘం తెలియజేసింది. తెలంగాణావారంతా ముందుకు రండని అడగడం అర్థపర్థం లేనిదని కొట్టిపారేసింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో అన్ని ప్రాంతాలవారు ఉన్నారనీ, ప్రతి రెండోళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అధ్యక్షులుగా తెలంగాణావారే ఉన్నారని గుర్తు చేశారు. ఏది ఏమైనా ఇండస్ట్రీవారంతా ఒకే తెగకు చెందినవారమని అన్నారు. హీరోలందరికీ ఫ్యాన్స్ ఉన్నారనీ, ఒక్క తెలంగాణా హీరోను ఆదరిస్తే... నితిన్ సినిమాలన్నీ తెలంగాణాలో 100 రోజులు ఆడాలి కదా..? ఆడితే సూపర్ స్టార్ కావాలి కదా..? మరి ఆయన సినిమాలు ఎందుకు చూడటం లేదు. అని ప్రశ్నించారు. ఇదంతా... పొద్దుపోక కొంతమంది చేస్తున్న ప్రకటనలుగా ఛాంబర్ తోసి పారేసింది.