Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొలి సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత... టీఆర్ఎస్ సభ్యత్వానికి శ్రీకారం..!

Advertiesment
TRS
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత తొలి సభ్యత్వాన్ని తీసుకుని సభ్యత్వ నమోదును ప్రారంభించారు. 
 
కాగా ఇటీవల తెలంగాణలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేపట్టిన సభ్యత్వ నమోదుకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు భారీ స్పందన లభించడం ఖాయమేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక చాలా రోజుల తర్వాత పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీఎం కేసీఆర్ బుధవారం చేసిన ప్రసంగం కూడా సభ్యత్వ నమోదుకు సహకరిస్తుందని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu