Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో 3 భవనాల నిర్మాణం... 11న శంకుస్థాపన.. టీ ప్రభుత్వం ప్రకటన

Advertiesment
telangana government three buildings try to build in hyderabad
, శనివారం, 6 డిశెంబరు 2014 (11:59 IST)
హైదరాబాద్‌లో మూడు కొత్త భవనాలను నిర్మించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపడుతోంది. ఈ నెల 11వ తేదిన శంకుస్థాపన జరుపనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 
 
ఆ మూడు భవనాలలో ఒకటి బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 10లో బంజారా భవన్, రెండోది ఆదివాసీ భవన్, మూడోది బాబూ జగ్జీవన్‌రామ్ భవన్ అని తెలిపింది. ఆ భవనాల నిర్మాణానికి స్థలాన్ని, నిధులను కేటాయించింది. 
 
ఈ మేరకు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఒక్కొక్క భవనాన్ని ఒక్కో ఎకరం విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఇందుకోసం స్థలాన్ని, ఒక్కో భవనానికి రెండున్నర కోట్ల రూపాయలను కేటాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై సంతకాలు పూర్తయినట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu