మెట్రో భూములలో వందల కోట్ల అక్రమాలు జరిగాయని, దీనిపైన శాసనసభలో చర్చకు అనుమతించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
మెట్రో భూముల పైన చర్చకు అనుమతించాలని సభాపతి మధుసూదనాచారిని కలిసిన సందర్భంగా కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మెట్రో భూముల పైన సభా కమిటినీ నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అందులో ప్రభుత్వం నచ్చిన వారిని పెట్టుకోవచ్చునని, తనను కూడా తీసుకోవాలన్నారు. మెట్రో భూముల్లో రూ.300 కోట్ల నష్టం జరిగినట్లుగా అధికారిక అంచనా, అనధికారికాంగా రూ.1000 కోట్ల నష్టం జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయన్నారు.
ఈ మొత్తం రామేశ్వర రావు ఖజనాకు వెళ్లిందని అంటున్నారన్నారు. రామేశ్వర రావుకు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చిత్తశుద్ధి ఉంటే, తాము నిజాయితీగా పని చేస్తున్నామనుకుంటే.. దానిని సభలో నిరూపించుకోవాలన్నారు.