Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణా ద్రోహుల వల్లే రాజీనామాలు: మధుయాష్కీ

తెలంగాణా ద్రోహుల వల్లే రాజీనామాలు: మధుయాష్కీ
, మంగళవారం, 19 జులై 2011 (19:43 IST)
FILE
తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కి కాంగ్రెస్ అధినాయకులపైనా, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంపైన విరుచుక పడ్డారు. తెలంగాణా అంశాన్ని నాన్చుతూ పోతే చల్లబడిపోతుందని కొంతమంది తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్లనే తెలంగాణా ఏర్పాటు జాప్యం అవుతోందని మండిపడ్డారు.

ముఖ్యంగా ఇటీవల ఉపముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న దామోదర రాజనరసింహ తెలంగాణా ద్రోహి అని తీవ్రంగా విమర్శించారు. ఆయనేదో తెంలగాణాను అభివృద్ధి చేస్తే సమస్య తీరిపోతుందని హైకమాండ్ వద్ద తప్పుడు మాటలు చెప్పి ఉద్యమాన్ని బలహీనం చేయాలని కుట్ర పన్నారన్నారు.

ఇక కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం తెలంగాణాపై చేసిన తప్పుడు ప్రకటనల వల్లనే తాము రాజీనామాల దాకా రావలసి వచ్చిందన్నారు. ఇప్పుడు సంప్రదింపులు, మూడు ప్రాంతాల వారితో మాట్లాడాలన్న సంగతి 2004లో గులాంనబీ ఆజాద్ కు తెలియవా అని ప్రశ్నించారు. ఆనాడు తెలంగాణా అంశాన్ని మ్యానిఫెస్టోలో ఎందుకు ప్రవేశపెట్టారంటూ ప్రశ్నించారు.

తెలంగాణాకు ప్రాణహిత - చేవెళ్ల రెండూ ఇస్తే ఉద్యమం ఆగిపోతుందని వారనుకుంటున్నారనీ, అయితే ప్రపంచంలో ఏ ఉద్యమాన్ని ఎవరూ, ఆఖరికి నియంతలు సైతం అడ్డుకోలేకపోయారని గుర్తు చేశారు. ఉద్యమాన్ని ఆపాలని చూస్తే ప్రభుత్వాలు కూలిపోతాయని హెచ్చరించారు.

ఇప్పటికైన గులాంనబీ ఆజాద్ తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కనపెట్టి తెలంగాణా ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకునే విధంగా అధిష్టానానికి సూచించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తెలంగాణాపై అనుకూలమైన నిర్ణయం తీసుకోకపోతే పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu