Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాంధీభవన్‌: వడ్లు దంచితే బియ్యం-రేవంతన్న సీఎం.. వీడియో ట్రెండ్

Advertiesment
Revanth Reddy
, ఆదివారం, 3 డిశెంబరు 2023 (13:47 IST)
Revanth Reddy
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీలో 119 సీట్లు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు. ఇప్పటికే 3 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ మరో 62 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాసేపట్లో గాంధీభవన్ చేరుకోనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ వర్గాలు విజయోత్సవ సంబరాలు ప్రారంభించాయి. రేవంత్ రెడ్డి ఫలితాలను సమీక్షించి కార్యకర్తలతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. 
 
తెలంగాణ ఎన్నికల ఫలితాల ట్రెండ్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండటం, కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉండటంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోసం నేతలు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ యాదవ్ తన సహచరులతో కలిసి రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. 
 
రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ కూడా ఉన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రతను పెంచారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు అక్కడికి చేరుకుని పటాకులు కాల్చి, నృత్యాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆస్వాదించారు. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార బీఆర్‌ఎస్ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిద్దిపేట హరీష్ రావు.. గజ్వేల్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందంజ