Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ద్యావుడా... రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం, కాంగ్రెస్ పార్టీలో గెలిచి సీఎం కావడం అంత వీజీ కాదు బుజ్జీ

Advertiesment
Revanth Reddy
, మంగళవారం, 5 డిశెంబరు 2023 (18:52 IST)
కర్టెసీ- రేవంత్ రెడ్డి ట్విట్టర్ పేజీ
గంటగంటకూ ఉత్కంఠ. రోజులు గడుస్తున్నకొద్దీ కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్. అందరూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటే ఆ స్థానంలో వరుసబెట్టి సీనియర్ల పేర్లు వినబడ్డాయి. ఐతే ఎట్టకేలకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఈరోజు సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణకు రేవంత్ రెడ్డి సీఎంగా నవంబరు 7న పదవీబాధ్యతలు చేపడుతారని ప్రకటించారు. సీఎల్పీ సమావేశంలో ఈమేరకు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు వెల్లడించారు. సీనియర్లకు కూడా తగిన ప్రాధాన్యత వుంటుందనీ, ఎమ్మెల్యేలంతా కలిసి టీంవర్క్ చేస్తారని ఆయన పేర్కొన్నారు.
 
webdunia
ఐతే అంతకుముందు సీఎం పేరు కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పారు కానీ అది కాలేదని ఢిల్లీకి ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్కలు వెళ్లాక అర్థమైంది. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగానూ, అన్నీ భుజాన వేసుకుని పార్టీని గెలిపించినా కూడానూ, ఓటర్లంతా అతడే సీఎం అని ఓట్లు వేసినా కూడానూ, కష్టపడిన నాయకుడు ఇక నేనే సీఎం అని అనుకున్నా కూడానూ, సర్వేలు గట్రా అన్నీ కూడా ఫలానా వ్యక్తికే ఆ స్టామినా వుందని చెప్పినా కూడానూ... కాంగ్రెస్ పార్టీలో గెలిచి సీఎం కావడం అంత వీజీ కాదు బుజ్జీ అనేది జరిగిన పరిణామాలను బట్టి తెలుస్తున్న నిజం.
 
webdunia
ఇక అసలు విషయానికి వస్తే... తాజాగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు రమ్మని పిలిచారు. దాంతో ఆయన హుటాహుటిని బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే తమ పదవులపై అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు భట్టి విక్రమార్క ఎవరి ప్రయత్నాలు వారు చేసారు. ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాభాలతో ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్.. 431 పాయింట్లు అప్