పోస్టల్ బ్యాలెట్‌లో తెలంగాణ అసెంబ్లీ బరిలో దిగిన బర్రెలక్క ముందంజలో నిలిచారు. నిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా తెలంగాణ అసెంబ్లీ బరిలో దిగిన ఈమె.. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో అదే జోరు కనబరుస్తున్నారు.
నియోజకవర్గంలోని ఉద్యోగులు బర్రెలక్క వెంటే నిలిచినట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తెలుస్తోంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకన్నా బర్రెలక్క వర్సెస్ కర్నె శిరీష ముందంజలో ఉన్నారు.
ఇకపోతే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో నిలిచారు.
ములుగులో సీతక్క 3,500 ఓట్లతో ముందంజలో ఉండగా.. హుజూర్ నగర్‌లో ఉత్తమ్ కుమార్, సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు తమ ప్రత్యర్థుల కన్నా ముందున్నారు.