తెలంగాణ తెలుగుదేశం ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణలో డిసెంబరు 7న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో పార్టీ నాయకులు మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా వున్నాయి.
* అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు
* రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ
* జిల్లాలు, జోనల్ వ్యవస్థలపై సమీక్ష
* 100 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్
* సాగునీటి కాంట్రాక్టుల్లో ఈపీఎస్ వ్యవస్థ రద్దు, స్థానిక కాంట్రాక్టర్లకే ప్రాధాన్యం
* తొలి, మలి దశ ఉద్యమకారులకు గుర్తింపు, ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం
* నిరుద్యోగులకు నెలసరి భృతి (రూ. 3 వేలు)కర్ణాటక తరహాలో లోకాయుక్త వ్యవస్థ బలోపేతం
* రూ. 10 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
* రూ. 2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్య నిధి
* ప్రభుత్వోద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపు
* పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
* ప్రతి గ్రామానికి పక్కా రోడ్డు, రక్షిత మంచినీరు, బస్సు సౌకర్యం
* పెండింగ్‌లో ఉన్న మండల, డివిజన్ డిమాండ్ల పరిష్కారం
* అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేత
* సంవత్సరంలోగా అమరవీరులకు స్మృతి వనం
* భూమిలేని నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 3 ఎకరాల భూమి, అర్హులందరికీ ఇచ్చేంత వరకు నెలకు రూ. 3 వేల ఆర్థిక సాయం
* బీసీ సబ్‌ప్లాన్
* మైనార్టీల సంక్షేమం కోసం సచార్, సుధీర్ కమిటీల నివేదికల అమలు
* సింగరేణి, ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు ఆసరా పింఛన్లు
* దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ
* ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్
* అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్, వైద్య సౌకర్యం, గృహ వసతి, సంక్షేమం కోసం ప్రత్యేక నిధి
* 5 సంవత్సరాలలోపు ప్రాక్టీస్ ఉన్న లాయర్లకు స్టైఫండ్
* ఏటా ఉద్యోగ కేలండర్
* అన్ని జిల్లా కేంద్రాల్లో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రాలు
* విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక ఎన్నారై శాఖ
* విత్తనం వేసే సమయంలోనే మద్దతు ధర ప్రకటన
* ఆదాయ భద్రత కోసం రైతు కమిషన్ ఏర్పాటు
* ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం... అంగన్వాడీ కేంద్రాలతో అనుసంధానం
* మండల కేంద్రాల్లో ఐటీఐ/జూనియర్ కళాశాల, నియోజకవర్గ కేంద్రంలో పాలిటెక్నిక్/డిగ్రీ కళాశాల, జిల్లాకో ఇంజనీరింగ్ కాలేజీ, పీజీ సెంటర్ ఏర్పాటు
* మహిళ, గిరిజన యూనివర్సిటీల ఏర్పాటు
* పట్టణాల్లో ఉచిత బస్తీ క్లినిక్‌ల ఏర్పాటు
* 104, 108 సేవలు ప్రభుత్వ పరిధిలోకి తెచ్చేలా కార్పొరేషన్ ఏర్పాటు
* ఇంటి పన్ను హేతుబద్ధీకరణ
* తెలంగాణ ఉద్యమ కళాకారులకు గుర్తింపు, తగిన వేతనం
* తెలంగాణ సినీ రంగానికి ప్రోత్సాహం, తెలంగాణ నేపథ్యంలో నిర్మించిన సినిమాలకు పన్ను రాయితీ
* ఖాయిలా పడిన పరిశ్రమల పరిరక్షణకు విధానం
* నిజాం షుగర్స్, సిర్పూర్ పేపర్ మిల్లు, సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ.