తెలంగాణా రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని, స్వతంత్ర్య అభ్యర్థులు కూడా కీలకంగా మారే అవకాశం ఉందని లగడపాటి రాజగోపాల్ సర్వేను వెల్లడించిన విషయం తెలిసిందే. టిఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం ప్రారంభమైందని, అధికారం కాంగ్రెస్ పార్టీదేనని, అది కూడా ప్రజాకూటమిగా ఏర్పడటం వల్ల విజయం ఖాయమన్న విషయాన్ని లగడపాటి చెప్పుకొచ్చారు.
ఎన్నికలకు ముందే లగడపాటి సర్వే చెప్పడం ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2009 సంవత్సరం నుంచి లగడపాటి చెబుతున్న సర్వేలన్నీ నిజమవుతున్నాయి. దీంతో ఈ సర్వే కూడా నిజమయ్యే అవకాశముందని విశ్లేషకులు భావించారు.
కానీ టిఆర్ఎస్ నేతలు మాత్రం లగడపాటి సర్వే అంతా బూటకమని, కాంగ్రెస్‌తో ఆయన లాలూచీ పడ్డారని ఆరోపించారు. తన సర్వే తప్పు కావడంతో ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారట లగడపాటి. ఇక నుంచి సర్వేలు చెప్పకూడదని తన సన్నిహితులకు చెప్పారట. మొత్తమ్మీద కేసీఆర్ షాక్ మామూలుగా లేదు...