Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్ అలవోక విజయం

Advertiesment
వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్ అలవోక విజయం
లండన్‌లోని లార్డ్స్ మైదానంలో వెస్టిండీస్‌తో జరిగిన ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 14.4 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.

ఇంగ్లాండ్ ఓపెనర్లు రవి బొపారా (60, 9 ఫోర్లు), రైట్ (75, 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసర బ్యాటింగ్‌తో వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ చెలరేగి ఆడటంతో వెస్టిండీస్ ఏ దశలోనూ కోలుకోలేదు. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్ మార్షల్ (35), శర్వాణ్ (46 నాటౌట్) రాణించారు.

Share this Story:

Follow Webdunia telugu