గురువారం జరిగిన ఐసీసీ ట్వంటీ-20 మహిళా ప్రపంచకప్ సెమీస్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఘోర పరాజయం పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లుకోల్పోయి 145 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ టీం కెప్టెన్ వాక్టిన్ అజేయంగా 89 పరుగులు చేసి జట్టు స్కోరుకు పునాదిగా నిలిచింది. దీంతో 146 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ముందుంచింది.
146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళా క్రికెటర్లు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 93 పరుగులు మాత్రమే చేశారు.
ఇదిలావుండగా న్యూజిలాండ్ బౌలర్లు రుక్, శేట్రిత్ వే లు చెరో రెండు వికెట్లు తీసుకుని తమ టీంకు గెలుపును అందించారు. కాగా భారత మహిళా క్రికెటర్లలో మిథాలీ రాజ్ 20 పరుగులు, అమితా శర్మ 24 పరుగులు, అంజూమ్ చోప్రా 15 పరుగులు చేశారు. మిగిలినవారు ఏమంతగా రాణించలేకపోవడంతో భారత్ 53 పరుగుల తేడాతో ఓడిపోయింది.