Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంగ్లాపై ఆసీస్, నెదర్లాండ్స్‌పై ఐర్లాండ్ విజయం

Advertiesment
బంగ్లాపై ఆసీస్, నెదర్లాండ్స్‌పై ఐర్లాండ్ విజయం
ఐసీసీ ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా సోమవారం ట్రెండ్‌బ్రిడ్జ్‌లో జరిగిన ప్రాక్టీసు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 38 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మ్యాచ్‌లో విజయం చివరకు ఆసీస్ పక్షానే నిలిచినప్పటికీ బంగ్లాదేశ్ గెలిచినంత పనిచేసింది. 220 పరుగుల లక్ష్యంతో దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియా బౌలర్లకు చెమటలు పట్టించారు.

బంగ్లా బ్యాట్స్‌మెన్ తొమ్మిది ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 92 పరుగులు పిండుకొని ఆస్ట్రేలియన్లను కంగారు పెట్టారు. అయితే చివరికి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 181 పరుగులతో సరిపెట్టుకున్నారు. షకిబ్ అల్ హసన్ (54), తమిమ్ ఇక్బాల్ (21), అష్రాఫుల్ (26), మహ్మదుల్లా (28) రాణించారు.

ఇదిలా ఉంటే మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు చేసింది. వాట్సన్ (52), హడిన్ (47), మైకెల్ క్లార్క్ (35), సైమండ్స్ (27) రాణించడంతో ఆస్ట్రేలియాకు భారీ స్కోరు సాధ్యపడింది. మరో ప్రాక్టీసు మ్యాచ్‌లో పసికూన జట్లు నెదర్లాండ్స్, ఐర్లాండ్ తలపడ్డాయి. సోమవారం జరిగిన నాలుగు ప్రాక్టీసు మ్యాచ్‌లలో ఇదొక్కటే రసవత్తరంగా సాగడం గమనార్హం.

లార్డ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ (135/9), ఐర్లాండ్ (135/7) రెండు జట్లు మ్యాచ్ ముగిసే సమయానికి సమాన స్కోరులతో నిలిచాయి. దీంతో సూపర్ ఓవర్‌లో మ్యాచ్ ఫలితాన్ని తేల్చారు. సూపర్ ఓవర్‌లో ఐర్లాండ్ విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 135 పరుగులు చేయగా, తరువాత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ కూడా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 135 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌లో ఐర్లాండ్ ఒక వికెట్ కోల్పోయి ఆరు పరుగులు చేయగా, నెదర్లాండ్ రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. సూపర్ ఓవర్‌లో దిగాల్సింది ముగ్గురు బ్యాట్స్‌మెన్ అయినందున రెండు వికెట్లు పడితే ఇన్నింగ్స్ ముగుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu