ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (53 నాటౌట్) అర్ధ సెంచరీతో కదం తొక్కడంతో స్కాట్లాండ్‌తో ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 137 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పీటర్సన్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఇంగ్లాండ్ ఓపెనర్ రవి బొపారా (32), మెర్గాన్ (23 నాటౌట్)లు కూడా రాణించారు. ఇదిలా ఉంటే అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. కోట్‌జెర్ (34), హామిల్టన్ (20), స్మిత్ (45) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కాలింగ్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు.