Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కెర్వెజీ అర్ధ సెంచరీ: నెదర్లాండ్స్ విజయం

కెర్వెజీ అర్ధ సెంచరీ: నెదర్లాండ్స్ విజయం
ఓపెనర్ కెర్వెజే (62), జ్యుడెరెంట్ (46) రాణించడంతో బుధవారం స్కాట్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 129 పరుగుల లక్ష్యాన్ని నెదర్లాండ్స్ మూడు వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో ఛేదించారు. కర్వెజే, జ్యుడెరెంట్‌లిద్దరూ రెండో వికెట్‌‍కు 110 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పి ప్రత్యర్థికి విజయాన్ని దూరం చేశారు.

ఇదిలా ఉంటే టాస్ గెలిచిన నెదర్లాండ్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. కొట్జెర్ (39), ఓపెనర్ వాట్స్ (20) టాప్ స్కోరర్లు. మిగిలిన స్కాట్లండ్ బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమయ్యారు. నెదర్లాండ్స్ బౌలర్లలో స్విఫెర్లీ, సీలార్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, బుఖారీ రెండు వికెట్లు దక్కించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu