Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇద్దరు స్పిన్నర్లకు చోటుదొరికే అవకాశం

Advertiesment
ఇద్దరు స్పిన్నర్లకు చోటుదొరికే అవకాశం
ఇంగ్లాండ్‌లో త్వరలో ప్రారంభం కాబోతున్న ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ మ్యాచ్‌లకు టీం ఇండియాలో ఇద్దరు స్పిన్నర్లకు చోటు కల్పించే అవకాశం ఉంది. జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన ట్వంటీ- 20 వార్మప్ మ్యాచ్‌కు జట్టులో ధోనీ ఇద్దరు స్పిన్నర్లుకు అవకాశం ఇచ్చాడు.

హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజాలు ఇద్దరూ ఈ మ్యాచ్‌లో ఆడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి బౌలింగ్ కోటాను ధోనీ పూర్తిగా ఉపయోగించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం ఏడుగురు బౌలర్లను ఉపయోగించుకున్న ధోనీ ఆర్పీ సింగ్, ఇశాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్‌లు పది ఓవర్లే బౌలింగ్ చేశారు.

హర్భజన్, ఓజాలు ఎనిమిది ఓవర్లు పూర్తి చేసుకున్నారు. ఈ ఐదుగురు బౌలర్లే మొత్తం 20 ఓవర్లలో 18 ఓవర్లు బౌలింగ్ చేశారు. బంగ్లాదేశ్‌‍తో శనివారం ట్రెంట్‌‍బ్రిడ్జ్‌‍లో జరిగే ప్రపంచకప్ తొలి ట్వంటీ- 20 మ్యాచ్‌కు ఈ ఐదుగురికే తుది జట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది. మరో పేస్ బౌలర్ జహీర్ ఖాన్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu