ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో టీం ఇండియా బంగ్లాదేశ్‌తో తలపడబోతుంది. ఈ మ్యాచ్ కోసం ఉత్సాహంతో ఎదురుచూస్తున్నట్లు బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ తెలిపాడు. తమీమ్ ఇక్బాల్ కారణంగానే భారత్ 2007 ప్రపంచకప్ లీగ్ దశ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది.
18 ఏళ్లకు ముందే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తమీమ్ ఆనాటి మ్యాచ్‌లో సాధించిన అర్ధ సెంచరీ (53 బంతుల్లో 51) భారత్‌ను లీగ్ దశ నుంచి ఇంటిముఖం పట్టింది. ఆ తరువాత బంగ్లాదేశ్ జట్టులో తమీమ్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. వన్డేల్లో ఒక సెంచరీ, ఎనిమిది అర్ధ సెంచరీలు సాధించిన తమీమ్ ట్వంటీ- 20 క్రికెట్‌లో 32 పరుగుల టాప్ స్కోరుతో తొమ్మిది మ్యాచ్‌లు ఆడాడు.
తనకు మంచి ఆరంభాలు వస్తున్నప్పటికీ, దానిని ఎక్కువసేపు క్రీజ్‌లో గడపడంపై దృష్టిపెట్టాలని విలేకరులతో చెప్పాడు. భారత్‌పై 15 ఓవర్లపాటు క్రీజ్‌లో ఉంటే తమ జట్టుకు మేలు జరుగుతుందని తమీమ్ తెలిపాడు.