స్వీట్‌కార్న్ సీడ్స్‌తో "ముత్యాల పాయసం"
కావలసిన పదార్థాలు :స్వీట్‌కార్న్ గింజలు.. వంద గ్రా. (పచ్చివి)పాలు.. అర లీ.కస్టర్డ్ పౌడర్.. రెండు టీ.పంచదార.. అర కప్పు యాలకుల పొడి.. అర టీ.తయారీ విధానం :స్వీట్‌కార్న్ గింజల్ని ఉడికించి పక్కన ఉంచాలి. ఓ గిన్నెలో పాలుపోసి వేడి చేయాలి. విడిగా ఓ చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి కస్టర్డ్ పొడి వేసి కలిపి దీన్ని పాలల్లో కలపాలి. ఈ మిశ్రమం చిక్కబడగానే పంచదార కూడా కలిపి కరిగించాలి. తరువాత స్వీట్‌కార్న్ గింజల్ని కూడా వేసి చల్లార్చాలి. చివరగా యాలకులపొడి కలిపితే ముత్యాల పాయసం తయార్..! రుచికోసం జీడిపప్పు, కిస్‌మిస్‌లను నేతిలో వేయించి కలుపుకోవచ్చు.