కావలసిన పదార్థాలు :
మైదా... అర కిలో
సోయా పప్పులు...అర కిలో
ఎండుకొబ్బరి పొడి... వంద గ్రా.
నెయ్యి... వంద గ్రా.
రీఫైండ్ ఆయిల్... తగినంత
బెల్లం తురుము... అరకిలో
ఉప్పు... పావు టీ.
నీరు... తగినంత
యాలక్కాయల పొడి... ఒక టీ.
తయారీ విధానం :
ముందుగా మైదాను జల్లించి, ఉప్పు తగినంత నీరు పోసి మృదువుగా కలపాలి. తరువాత వంద గ్రాముల నూనె కాచి పిండిలో పోసి మెత్తగా కలిపి చల్లటి బట్ట కప్పి రెండు గంటలపాటు నానబెట్టాలి. ముందురోజే నానబెట్టిన సోయా పప్పులను మూడు నిమిషాలసేపు ఉడికించి, ఆరబెట్టి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.
బెల్లం తీగపాకం పట్టి అందులో యాలక్కాయలపొడి, సోయాపప్పు మిశ్రమం, కొబ్బరిపొడి, సగం నెయ్యి పోసి ముద్దగా కలిపి ఆరిన తరువాత కావలసిన సైజులో ఉండలు చేయాలి. ఇప్పుడు ఈ ఉండలను పైన కలిపి ఉంచుకున్న మైదాపిండి ముద్దలో ఉంచి, అంచులను మధ్యకు మడిచి, చేతితో గుండ్రంగా మృదువుగా బొబ్బట్లలాగానే వత్తాలి.
వీటిని మిగిలిన సగం నేతిలో కాస్తంత రీఫైండ్ ఆయిల్ కలిపి, పెనంపై కొద్ది కొద్దిగా వేస్తూ బొబ్బట్లను బంగారు వర్ణం వచ్చేదాకా కాల్చి తీసేయాలి. అంతే సోయా కోకోనట్ బొబ్బట్లు రెడీ..!