కావలసిన పదార్థాలు :
సొరకాయ (లేతది)... చిన్నది
పంచదార... 150 గ్రా.
పాలు... ఒకటిన్నర లీటరు
కుంకుమపువ్వు... అరటీస్పూను
జీడిపప్పు... ఒక టీ.
కిస్‌మిస్... ఒక టీ.
కోవా... వంద గ్రా.
తయారీ విధానం :
సొరకాయను శుభ్రంగా కడిగి తొక్క తీసి తురమాలి. ఓ బాణలిలో ఈ తురుము వేసి అది మునిగేవరకూ నీళ్లు పోసి మూతపెట్టి మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. తరవాత పాలు పోసి కలపాలి. పాలు చిక్కగా అయ్యేవరకూ ఉడికించాలి.
ఇప్పుడు పంచదార, కాసిని పాలల్లో నానబెట్టిన కుంకుమపువ్వు కూడా వేసి కలిపి దించాలి. విడిగా మరో బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్ వేసి వేయించి ఖీర్‌లో కలిపితే వేడి వేడి సొరకాయ ఖీర్ రెడీ అయినట్లే..!