కావలసిన పదార్థాలు :
సెనగపప్పు... 240 గ్రాములు
కొబ్బరి... సగం చిప్ప
బెల్లం... 440 గ్రాములు
ఏలక్కాయల పొడి... తగినంత
మైదా... 450 గ్రాములు
తెల్లని గోధుమపిండి... 300 గ్రాములు
తయారీ విధానం :
మైదా లేదా గోధుమపిండిని అర టీస్పూను ఉప్పు, పావు టీ స్పూను పసుపు, కొంచెం నీళ్లు కలిపి పిండి తడుపుకోవాలి. గరిటెడు నూనెను కూడా పిండికి కలపాలి.
కొంచెం సెనగపప్పును నానబెట్టి బాగా కడగి, రాళ్లుంటే తీసేయాలి. నీటిని మరగబెట్టి, పప్పు అందులో వేసి ఉడికించాలి. బాగా ఉడికిన పప్పులో నీటిని వంచేసి, జల్లెడతో జల్లించుకోవాలి. పప్పుకు కొబ్బరి, బెల్లం కలిపి మెత్తగా హల్వాలాగా చేసుకోవాలి. దీనికి ఏలక్కాయల పొడిని కూడా కలపాలి.
తడిపి ఉంచుకున్న పిండిని పూరీల్లాగా చేసుకుని వాటిల్లో ఈ పూర్ణాన్ని పెట్టి అంచులను మూసేయాలి. దీన్ని అరటి ఆకుపై వేసి నూనె రాసి మెల్లగా చపాతీల్లాగా చేత్తో వత్తుకోవాలి. ఇలా మొత్తం పిండిని చేసుకున్న తరువాత పెనంపై వేసి, నేయిరాసి బాగా కాల్చుకోవాలి. ఇవి వేడి వేడిగా తింటే మాంచి నెయ్యి వాసనతో కమ్మగా ఉంటాయి.