వెరైటీ అండ్ టేస్టీ "సోయా-బెల్లం జంతికలు"
కావలసిన పదార్థాలు :సోయాపిండి.. పావు కేజీబియ్యంపిండి.. ముప్పావు కేజీబెల్లం తురుము.. 400 గ్రా.నూనె.. తగినంతవెన్న.. 50 గ్రా.తెల్ల నువ్వులు.. 50 గ్రా.యాలకుల పొడి.. ఒక టీ.మిరియాల పొడి.. అర టీ.తయారీ విధానం :బియ్యంపిండిలో సోయా పిండి, నువ్వులు, యాలకులు, మిరియాల పొడులు వేసి బాగా కలపాలి. బెల్లం తురుములో కాస్త నీరు కలిపి మెత్తగా కరిగించి అందులో బియ్యప్పిండి మిశ్రమం వెన్న వేసి బాగా కలిపి ముద్దలా చేయాలి. దీన్ని గాలి చొరబడకుండా అరగంటసేపు ఉంచాలి. కడాయిలో నూనె పోసి కాగిన తరువాత గిద్దలతో జంతికలుగా వత్తాలి. దోరగా వేగాక తీయాలి. చల్లారిన తరువాత వాటిని డబ్బాలో పెడితే 15 రోజులవరకూ నిల్వ ఉంటాయి.