కావలసిన పదార్థాలు :
పాలు... ఒక కప్పు
కండెన్స్‌డ్ మిల్క్... అర కప్పు
నెయ్యి... నాలుగు టీస్పూన్లు
బొంబాయి రవ్వ.. అరకప్పు
యాలకులపొడి... ఒక టీస్పూన్
ఎండుద్రాక్ష... రెండు టీస్పూన్లు
సన్నగా తరిగిన ఆల్మండ్ లేదా జీడి పప్పులు.. రెండు టీస్పూన్లు
తయారీ విధానం :
బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక రవ్వ పోసి బంగారు రంగు వచ్చేదాకా వేయించాలి. వేరే గిన్నెలో పాలు, కండెన్స్డ్ మిల్క్ కలిపి కాగబెట్టాలి. అందులోనే వేయించిన రవ్వ, యాలకులపొడి వేసి బాగా కలపాలి. సన్నటిమంటమీద, నెయ్యి పైకి తేలేంతదాకా బాగా కలుపుతూ ఉడికించాలి.
నెయ్యి పైకి తేలిందని అనిపించాక అందులో వేయించిన ఎండుద్రాక్ష కూడా వేసి దించి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డుల్లాగా చేసుకోవాలి. వేడి ఆరకముందే సన్నగా తరిగి వేయించిన ఆల్మండ్ లేదా జీడి పప్పులను లడ్డూలపైన అతికించాలి. అంతే రవ్వ ఆల్మండ్ నెయ్యి లడ్డు రెడీ అయినట్లే...!