కావలసిన పదార్థాలు :
మామిడిపండ్ల గుజ్జు... రెండు కప్పులు
వెన్నతీసిన పాలు... ఒక లీటర్
బియ్యం... ఒకటిన్నర కప్పు
బెల్లం... పది టీ.
ఉప్పు... చిటికెడు
నెయ్యి... రెండు టీ.
జీడిపప్పు... పావు కప్పు
కిస్‌మిస్... పావు కప్పు
యాలకుల పొడి... ఒక టీ.
మామిడిపండు ముక్కలు... గార్నిష్ కోసం తగినన్ని
తయారీ విధానం :
తగినంత నీరుపోసి బియ్యాన్ని పదిహేను నిమిషాలు నానబెట్టాలి. పాలు మరుగుతుండగా నీళ్లలోంచి తీసిన బియ్యాన్ని వేసి మెత్తగా అయ్యేంతదాకా ఉడికించాలి. అందులోనే బెల్లం వేసి కరిగేంతదాకా ఉంచి, ఉడికాక దించాలి. తరువాత ఓ పాత్రలో నెయ్యి వేసి కిస్‌మిస్, జీడిపప్పును వేయించాలి.
పైన ఉడికించిన మిశ్రమంలో మామిడిపండు గుజ్జు, చిటికెడు ఉప్పు, యాలకులపొడి వేసి కలపాలి. ఇప్పుడీ మిశ్రమాన్ని సర్వింగ్ కప్స్‌లలో పోసి పైన జీడిపప్పు, కిస్‌మిస్, మామిడిపండు ముక్కలతో గార్నిష్ చేసి చల్లచల్లగా సర్వ్ చేయాలి. అంతే సమ్మర్ స్పెషల్ మ్యాంగో పాయసం సిద్ధమైనట్లే...!