కావలసిన పదార్థాలు :
మామిడిపండు గుజ్జు... అరకేజీ
కోవా... అరకేజీ
పంచదారపొడి... అరకేజీ
యాలక్కాయలపొడి... ఒక టీ.
బాదంపప్పు... రెండు టీ.
జీడిపప్పు... అరకప్పు
కిస్‌మిస్... రెండు టీ.
తయారీ విధానం :
మామిడిపండు గుజ్జులో రెండు టీస్పూన్ల పంచదార కలపాలి. పాన్‌లో ఈ గుజ్జు వేసి సగం అయ్యేదాకా ఉడికించాలి. మరో పాన్‌లో సన్నటి సెగమీద కోవాను గోధుమ రంగు వచ్చేదాకా వేయించాలి. ఆ తరువాత ఉడికించిన మామిడిపండు గుజ్జును కోవా మిశ్రమంలో కలపాలి.
ఒక ప్లేటుకు కొద్దిగా నెయ్యి రాసి, పై మిశ్రమాన్ని పోసి సమంగా పరచాలి. చల్లారిన తరువాత కావాల్సిన రీతిలో ముక్కలుగా కోసుకుని, పైన బాదంపప్పు, జీడిపప్పు, కిస్‌మిస్‌లతో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే కమ్మటి తియ్యనైనా మ్యాంగో కాజూ బర్ఫీ రెడీ అయినట్లే...!